Header Banner

హిమానీ నర్వాల్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్! నిందితుడు అరెస్ట్... అసలు నిజం ఏంటంటే?

  Mon Mar 03, 2025 13:02        India

హర్యానాకు చెందిన యువ కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మార్చి 1న రోహ్‌తక్ -ఢిల్లీ హైవేలోని సంప్లా బస్టాండ్ సమీపంలో ఓ సూట్ కేసులో హిమానీ నర్వాల్ మృతదేహం లభ్యం అయింది. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి హర్యానా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం సోమవారం ఒక నిందితుడిని పట్టుకుంది. ఆ వ్యక్తి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

నిందితుడు హిమానీ నర్వాల్ కు పరిచయం ఉన్న వ్యక్తేనని వారు తెలిపారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీ కోరతామని సిట్ వెల్లడించింది. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిమానీ మృతదేహం దొరికిన రెండు రోజుల తర్వాత ఢిల్లీలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు సచిన్ అని తెలిసింది. అరెస్ట్ సమయంలో సచిన్ వద్ద హిమాని నర్వాల్ మొబైల్ ఫోన్ కూడా దొరికింది. హర్యానాలోని బహదూర్ గఢ్ నివాసి అయిన సచిన్.. హిమాని నర్వాల్ తన నుంచి లక్షలు వసూలు చేసిందని.. మరిన్ని డబ్బులు డిమాండ్ చేసిందని పోలీసులకు చెప్పాడు.

 

ఆమె తనను బ్లాక్ మెయిల్ చేసిందని కూడా ఆరోపించాడు. నిరంతరం డబ్బు డిమాండ్ చేయడం వల్లే రోహ్ తక్ లోని ఆమె నివాసంలో హిమానిని చంపానని సచిన్ ఒప్పుకున్నాడు. హిమాని నర్వాల్ రోహ్‌తక్ లోని విజయ్ నగర్ లోని తమ పూర్వీకుల ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న చిత్రాలు వైరల్ కావడంతో ఆమె వెలుగులోకి వచ్చింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #HimaniNarwal #HaryanaCrime #MurderCase #SITInvestigation #SachinArrested #HimaniMurder #JusticeForHimani #CongressWorker #PersonalDispute #ViralCase